Chaava in Telugu: బాలీవుడ్‌లో ఊపు ఊపిన సూపర్ హిట్ మూవీ తెలుగులోనూ రానుంది! ఛావా తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయనున్న గీతా ఆర్ట్స్
విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక (Rashmika) ప్రధాన పాత్రల్లో చిత్రం ‘ఛావా’ (Chhaava). బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ మేరకు పోస్ట్ పెట్టింది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7 నుంచి ‘ఛావా’ తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని వెల్లడించింది.
Hyderabad, FEB 26: విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక (Rashmika) ప్రధాన పాత్రల్లో చిత్రం ‘ఛావా’ (Chhaava). బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ మేరకు పోస్ట్ పెట్టింది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7 నుంచి ‘ఛావా’ తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని వెల్లడించింది. వెండితెర వేదికగా ఈ చిత్రాన్ని వీక్షించాలని ప్రేక్షకులను కోరింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితాధారంగా రూపొందిన చిత్రమే ‘ఛావా’. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు.
‘Chhava’ Telugu-Dubbed Version To Release on March 7, 2025
శంభాజీ కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌లో ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ విడుదల కానుందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని సమాచారం.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగం కావడంపై విక్కీ సంతోషం వ్యక్తం చేశారు. పోరాట యోధుడి కథలో నటించడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ పాత్రలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు టీమ్ వెల్లడించింది. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో విక్కీ చేతులను రాత్రంతా తాళ్లతో కట్టేయాల్సి వచ్చిందని.. ఆ సీన్ తర్వాత సుమారు నెలన్నరపాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. శంభాజీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సన్నివేశం షూట్ చేసినప్పుడు విక్కీ భావోద్వేగానికి గురైనట్లు చెప్పింది.